ముద్దనూరుకు చెందిన ఐదుగురు స్నేహితులు గురువారం గండికోట జలాశయం వద్దకు వెళ్లారు. గండికోట వెనుక జలాల్లో సరదాగా ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. గాలి ఎక్కువగా ఉండటంతో నీటి ప్రవాహంలో రేగడిపల్లె సమీపం వరకు చేరి ముళ్ళపొదలో చిక్కుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులకు సమాచారమందించారు. వెంటనే స్పందించిన పోలీసులు నీటిలో చిక్కుకున్న వారితో మాట్లాడి తగిన సూచనలు ఇస్తూ ఒడ్డుకు చేరేలా చొరవ తీసుకుని ప్రాణాలు కాపాడారు.