కె. తిమ్మాపురంలో 25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ

54చూసినవారు
కె. తిమ్మాపురంలో 25% రాయితీపై శనగ విత్తనాల పంపిణీ
ముద్దనూరు మండలం కె. తిమ్మాపురం సచివాలయంలో సోమవారం వ్యవసాయాధికారులు రబీ 2024-25 కు సంబంధించి రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతు వాటా డబ్బులు చెల్లించిన వారికి 25 % రాయితీతో ఎడిఏ వెంకట సుబ్బయ్య, ఏఓ వెంకట క్రిష్ణారెడ్డిలు సబ్సిడీ శనగలను పంపిణీ చేశారు. 25 శాతం రాయితీ పైన తిమ్మాపురం, ఆర్. జె. పల్లి గ్రామాల్లో 110 మంది రైతులకు 176 క్వింటాలా 876 బస్తాల శనగలు పంపిణి చేశారు.

సంబంధిత పోస్ట్