ముద్దనూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపిడిఓ

60చూసినవారు
ముద్దనూరు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: ఎంపిడిఓ
కడప జిల్లా ముద్దనూరు మండలంలోని యస్వీ గిరి కాలనీ, ఎస్సి కాలనీలో విష జ్వరాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఎంపిడిఓ ముకుంద రెడ్డి బుధవారం ఆ కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డా. కరిష్మాతో కలిసి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించారు. కాలనీవాసులు దోమలు, పందులు ఎక్కువగా ఉన్నట్టు వినతిపత్రం అందజేయడంతో, బ్లీచింగ్ చల్లడం, ఫాగింగ్ చేయించాలనే ఆదేశాలు ఇచ్చారు. పరిశుభ్రతకు సహకరించాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్