జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలోఆదివారం ఉదయం వర్షాలు విస్తారంగా పడి పంటలు బాగా పండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి గ్రామ ప్రజలతో కలిసి పోతురాజు స్వామికి నీరు పోసి ప్రత్యేకంగా పూజించారు. స్వామివారికి కాయ కర్పూరం సమర్పించి వర్షాలు బాగా పడాలని కోరుకున్నట్లు వారి తెలిపారు.