జమ్మలమడుగులో మంగళవారం సెక్రటరీ-కం-సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్ లను మంగళవారం విజిట్ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యతను తెలిపారు. జైలు లోపల ఖైదీల హక్కులు, ఉచిత న్యాయ సహాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టంల గూర్చి తెలిపారు. ఖైదీలతో మాట్లాడి కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.