తొండూరు మండల పరిధిలోని కోరవానిపల్లి గ్రామంలో గొర్రెలను దొంగతనాలు చేసిన నిందితులను బుధవారం అరెస్ట్ చేసినట్లు సిఐ వెంకట రమణ, ఎస్ఐ పెద్ద ఓబన్న తెలిపారు. తొండూరు స్టేషన్ లో వారు మాట్లాడుతూ.. మండలంలోని కోరవానిపల్లి గ్రామంలో కొప్పల రామకృష్ణ, వెంకట రమణ గొర్రెల దొడ్డిలో నుంచి ఎనిమిది గోర్లు దొంగతనం చేశారు. వీటి విలువ రూ. లక్ష 30 వేలు ఉంటుందని సీఐ వెంకటరమణ తెలిపారు.