బైకు అదుపు తప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
ముద్దనూరు- జమ్మలమడుగు ప్రధాన రహదారిలోని మునయ్యస్వామి కొన వద్ద బుధవారం ఉదయం ద్విచక్రవాహనంపై వెళుతూ అదుపు తప్పి కింద పడటంతో జమ్మలమడుగుకు చెందిన ఇర్ఫాన్, ఇస్మాయిల్ తీవ్రంగా గాయపడినట్లు ముద్దనూరు పోలీసులు తెలిపారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు మైరుగైన వైద్యం కోసం 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.