కడప జిల్లాలో ఇరు వర్గాల ఘర్షణ
ఎర్రగుంట్ల పట్టణంలో శుక్రవారం వినాయక మండపం వద్ద ఏర్పాట్లలో ఇరు వర్గాల ఘర్షణ చోటు చేసుకున్నది. స్థానికుల వివరాల మేరకు ఈ ఘర్షణ లో మధుసూదన్ రెడ్డి, తులసి రామ్ లపై పలువురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచినట్లు తెలిపారు. బాధితులు పొద్దుటూరు ఆసుపత్రిలోని అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిలో కొందరు వ్యక్తులు ఎర్రగుంట్ల స్టేషన్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.