ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

84చూసినవారు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణం నాగలకట్ట వీధిలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతం ఘనంగా నిర్వహించారు. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా ఆలయ పూజారి హరి కిరణ్ శర్మ మహిళలకు వరలక్ష్మి వ్రత విశిష్టతను తెలిపి, వారితో శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిగిలిన లక్ష్మీ పూజలకంటే  వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని తెలిపారు.

సంబంధిత పోస్ట్