నేటి నుంచి కోగటం ఉరుసు

75చూసినవారు
నేటి నుంచి కోగటం ఉరుసు
మండల పరిధిలోని కోగటం గ్రామంలో వెలసిన హజరత్ సయ్యద్ షా ఆలంపీర్ ఖుద్దిససిర్రహు వారి ఉరుసు కార్యక్రమాలు శనివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శనివారం గంధం, ఆదివారం ఉరుసు మహోత్సవాలను దివంగత గండ్లూరు పెద్ద వీరారెడ్డి కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్