కమలాపురం మండలం శ్రీ రామాపురం పుణ్యక్షేత్రంలో వెలసిన మోక్షనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో మహా కోటి దీపోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ప్రధాన సేవకులు కాశిభట్ల సాయినాధ్ శర్మ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసారు. అలాగే శ్రీ సుబ్రమణ్య స్వామి వారికీ ఆలయ మాడ విధులలో ఊరేగింపు నిర్వహించారు.