కమలాపురం పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు

1039చూసినవారు
కమలాపురం పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు
కమలాపురం ఎస్. ఐ హృషికేశవ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కమలాపురం పట్టణంలో "సశస్త్ర సీమాబల్ " కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్