కమలాపురం నియోజకవర్గం వీరపనాయుని పల్లె మండలం అడవిచెర్లో పల్లె గ్రామానికీ చెందిన సాయినాథ్ శర్మ ఆత్మీయుడు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి బుధవారం ఇచ్చిన విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విందుకు సాయినాథ్ శర్మ నియోజకవర్గంలోని ఆయన అభిమానులు నారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గ్రామానికీ విచ్చేసిన సాయినాథ్ శర్మకు గ్రామ సర్పంచ్ నారాయణ రెడ్డి, కృష్ణారెడ్డి, తదితర గ్రామ నాయకులు స్వాగతం పలికారు.