రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించింది. ముదివేడు ఎస్ఐ దిలీప్ కథనం ప్రకారం.. బీకొత్తకోట మండలం, బడికాయలపల్లి, చింతమాకులపల్లెకు చెందిన చిన్నప్ప అంగళ్లులో ఉంటూ చెక్కిలాల వ్యాపారం చేస్తున్నాడు. మొలకలచెరువు రోడ్డులోని పల్లెల్లో చెక్కిలాలు అమ్ముకుని వస్తుండగా దొమ్మన్న బావి వద్ద ఆర్టీసీ బస్సు బైకును ఢీకొట్టగా తీవ్రంగా గాయపడి అపస్మారస్థితికి చేరుకోగా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు.