దువ్వూరు మండలం జిల్లెల్ల సమీపంలో కేసికెనాల్ కాలువ ప్రమాదకరంగా తయారైంది. కాలువ పై ఒక దగ్గర సిమెంట్ లైనింగ్ దెబ్బతినడంతో పాటు కట్ట కొతకు గురైనట్లు కుంగి పోయింది. ఇదే సమయంలో కాలువలో నీటి ప్రవాహం పుల్ గా ఉండటంతో నీరు కాలువ దెబ్బతిన్న ప్రాంతంలో కొద్ది కొద్దిగా నీరు లీక్ అవుతోంది. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కాలువలో మరింత నీటి ప్రవాహం పెరిగితే అక్కడ కాలువ కోతకు గురై గండి పడే అవకాశం ఉంది.