వేసవిలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం అవసరం

68చూసినవారు
వేసవిలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం అవసరం
వేసవిలో అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా మదనపల్లెలో విద్యార్థులకు శనివారం అగ్ని ప్రమాదాలు ఎలా సంభవిస్తాయి. వాటిని నివారించే మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాల సమయంలో ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్