కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం దిరసవంచ పంచాయితీ పెద్దిరాజు పల్లె గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎంపీపీ వీరనారాయణరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీ జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను పంపిణీ చేసి అంగన్వాడి స్టాల్స్ ను పరిశీలించారు. కార్యక్రమంలో బద్వేల్ డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో చంద్రహాసరెడ్డి, మండల ప్రత్యేక అధికారి నరసింహారెడ్డి, తహసిల్దార్ సువర్ణాదేవి, తదితరులు పాల్గొన్నారు.