మైదుకూరు పట్టణం కడప రోడ్డు అంబేద్కర్ విగ్రహం బస్ షట్టర్ ఆవరణంలో మురళి అను వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడని, వడదెబ్బ లేదా ఆరోగ్యం విషమించిందని నేస్తం సేవా సంస్థ సభ్యులకు తెలియడంతో ఈ విషయాన్ని మైదుకూరు ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ సయ్యద్ కరిముల్లా, వారికి ఫోన్ ద్వారా విషయం తెలియజేసి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి వైద్యం చేయిస్తున్నారు. ఈయన బంధువులు ఎవరైనా ఉంటే మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి రాగలరని తెలిపారు.