మైదుకూరు: గాయత్రీదేవి అలంకారంలో వాసవి మాత

74చూసినవారు
దసరా రెండవ రోజు సందర్భంగా శుక్రవారం మైదుకూరు పట్టణంలోని వాసవి మాత అమ్మవారు గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అమ్మవారిశాలలో ప్రాతకాల పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, వాసవి మాత మూల మంత్ర హోమము, హోమాలు నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజ, నవగ్రహ జపము, దీక్ష హోమము, దేవి పంచసూక్త హోమాలు నిర్వహించారు. భక్తులు గాయత్రీ దేవి అలంకరణలో వాసవి మాతను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్