పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సంవత్సరానికి 4 సార్లు గ్రామ సభలను నిర్వహించాలని షరీఫ్, ప్రతాప్ డిమాండ్ చేశారు. గురువారం వారు ప్రొద్దుటూరు ఎంపీడీవో సూర్యనారాయణ రెడ్డికి వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ జనవరి 2న గ్రామ సభలను చట్ట ప్రకారం నిర్వహించాలన్నారు. సభల్లో ప్రతి ఓటర్ పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామసభల షెడ్యూల్ ను ముందుగా ప్రకటించి, ప్రచారం చేస్తామని ఎంపీడీవో తెలిపారు.