ప్రొద్దుటూరు: "మీ అవినీతిని నిరూపించకపోతే రాజీనామా చేస్తా"

68చూసినవారు
ప్రొద్దుటూరు: "మీ అవినీతిని నిరూపించకపోతే రాజీనామా చేస్తా"
ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ శివచంద్రారెడ్డి అవినీతిని నిరూపించకపోతే.. తన పదవికి రాజీనామా చేస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి సవాల్ విసిరారు. గురువారం ప్రొద్దుటూరులో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ స్మశాన వాటిక లెవలింగ్ చేయకుండానే రూ. 40 లక్షలు డ్రా చేశారన్నారు. కుళాయి కనెక్షన్లకు రూ. 10 లక్షలు తీసుకున్నాడని, అందుకు ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్