రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులను, ఖర్చులను మీడియా ద్వారా ప్రజలకు తెలపాలని ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి కోరారు. సోమవారం ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్యకు ఆయన వినతిపత్రం అందించారు. లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పలు రకాల పన్నుల ద్వారా చెల్లించిన సొమ్మును ప్రభుత్వం అప్పులకు చెల్లిస్తోందన్నారు. ప్రతినెల ప్రభుత్వం చేస్తున్న ఖర్చులను, అప్పులను ప్రజలకు వివరించాలన్నారు.