కడప ఉక్కు పరిశ్రమ కోసం నిరంతర పోరాటం సాగిస్తామని డీవైఎఫ్ఎస్ఐ మాజీ నాయకుడు సత్యనారాయణ, జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ. కడప ఉక్కు పరిశ్రమ కోసం కేంద్రాన్ని నిలదీయడంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు విఫలమయ్యాయని విమర్శించారు. డీవైఎఫ్ఎస్ఐ పట్టణ నూతన అధ్యక్షుడిగా మేరీ కుమార్, కార్యదర్శిగా విశ్వనాథ్, ఉపాధ్యక్షుడిగా వెంకటేన్లను ఎన్నుకున్నారు.