చక్రాయపేటలో ఘర్షణ.. మాజీ ఎంపీటీసీ మృతి

61చూసినవారు
చక్రాయపేట మండలం గండికోవూరు హరిజనవాడలో శుక్రవారం ఇరు కుటుంబాలు ఘర్షణలో ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు ఇంటి వద్దకు మురికి నీరు విషయంలో ఇరు కుటుంబాలు ఘర్షణకు దిగారు. ఘర్షణలో మాజీ ఎంపీటీసీ దండు యోగాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. యోగాంజనేయులు(38)పై నల్ల కదిరిగాళ్ళ నాగార్జున తలపై ఇనుపరాడ్లతో కొట్టడంతో మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్