పులివెందుల పట్టణంలో నవోదయ పరీక్ష ప్రశాంతంగా జరుగిందని ఎంఈఓ చంద్రశేఖర రావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ పులివెందుల పట్టణంలో రెండు కేంద్రాల్లో నవోదయ పరీక్ష జరుగుతోందని, ఈ పరీక్షకు 418 మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాస్తున్నారన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు.