పులివెందుల పట్టణంలోని ఫుడ్ అండ్ సైన్స్ కళాశాల వద్ద ఆదివారం కూలీల ఆటోను లారీ ఢీకొట్టిన విషయం తెలిసిందే. 10 మంది గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన నాగేశ్వరి, భవాని, వెంగమ్మ, వెంకట లక్ష్మమ్మ, రమణమ్మ, శిరోమణి, నారాయణమ్మ, వెంకటమ్మ, లక్ష్మీదేవి, పుల్లమ్మ, ఆటో డ్రైవర్ శంకర్ గాయపడ్డారు. వీరిలో భవానికి చేయి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.