జగన్ ముఖ్యమంత్రిగా ప్రజలకు సంక్షేమ పాలన అందించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని జగన్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో సాధ్యం కానీ హామీలను ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. 9 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుందని విమర్శించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.