మున్సిపల్ పరిధిలో వంద శాతం ఆస్తి పన్నులు వసూలు చేయాలని మున్సిపల్ కమిషనర్ రాముడు పేర్కొన్నారు. మంగళవారం పులివెందుల పట్టణంలో ఆస్తి పన్ను వసూలుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచార పన్ను వసూలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని ప్రజల ఇంటి వద్దకే వెళ్లి ఆస్తి పన్ను వసూలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.