పులివెందుల పట్టణ పరిధిలోని వాసవీ కాలనీలో తిష్ట వేసిన మురుగు నీటి సమస్యను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార మాజీ ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, మండల సమన్వయకర్త తిరుపాల్ రెడ్డిలు డిమాండ్ చేశారు. వాసవి కాలనీని శనివారం వారు సందర్శించారు. కాలనీలో ప్రవహిస్తున్న మురుగు నీటిని పరిశీలించారు. మాట్లాడుతూ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మురుగునీరు రోడ్లపైనే ప్రవహిస్తోందన్నారు.