దళారుల నుంచి చీనీ రైతులను కాపాడాలి

59చూసినవారు
దళారుల నుంచి చీనీ రైతులను కాపాడాలి
పులివెందుల చీనీ రైతులను సిండికేట్ వ్యాపారుల, దళారుల నుంచి కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు రాజారాం రెడ్డి తెలిపారు. శుక్రవారం పులివెందల చీనీ మార్కెట్ యార్డును వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కమీషన్ 4% ఉంటే 8% వ్యాపారులు వసూలు చేస్తున్నారన్నారు. చీనీ రైతుల సమస్యలను పరిష్కరించాలని మార్కెటింగ్ శాఖ కార్యదర్శి శ్రీధర్ కు వినతిపత్రం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్