భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు గర్హనీయమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం వేంపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజ్యసభలో అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి వెంటనే తొలగించాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.