రైల్వేకోడూరు నుండి గుర్రప్పపాలెంకు వెళ్లు దారి నడవడానికి వీలు లేకుండా పంచాయతీ పారిశుధ్య కార్మికులు చెత్త వేయడంతో ఆ గ్రామస్తులు గురువారం టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల రాయుడుని కలసి వారి సమస్యను తెలిపారు. ఆయన ఆ ప్రదేశాన్ని శుక్రవారం సందర్శించి జేసీబీని ఏర్పాటు చేసి ఆ చెత్తను సొంత నిధులతో క్లియర్ చేయించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు బత్యాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.