రైల్వే కోడూరు నియోజకవర్గంలో 26వ తేదీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు క్రియాశీలకంగా ఉండి, సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రతి గ్రామంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని టిడిపి నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానందరెడ్డి కోరారు. శుక్రవారం రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశాలను అనుసరించి సభ్యత నమోదు కోసం తెదేపా మండల అధ్యక్షులు, నాయకులు, మహిళా కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.