గాలివీడు మండలం బోరెడ్డి గారి పల్లి వద్ద జరిగిన వెంకటరమణ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని గురువారం డిఎస్పీ కృష్ణ మోహన్ తెలిపారు. 22వ తేదీ రాత్రి బోరెడ్డి గారి పల్లి వద్ద జరిగిన నాటక ప్రదర్శనలో ఇరువురి మధ్య జరిగిన వివాదం హత్యకు దారి తీసిందని ఆయన తెలిపారు. మృతుడు వెంకటరమణను రమణారెడ్డి అతని ఇద్దరు కుమారులు కలిసి బండరాళ్లతో కొట్టి చంపినట్లు విచారణలో తేలింది అన్నారు.