గాలివీడు మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు గురువారం తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే దురృష్టవశాత్తు అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని సీఐ కొండారెడ్డి తెలిపారు. పందిల్లపల్లి పరిధిలోని హారిజనవాడకు చెందిన కోట్లపల్లి పవన్ కుమార్ (18)గా గుర్తించామని అన్నారు. పవన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.