పులికుంట గ్రామ సచివాలయంలో సిబ్బంది కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడం ప్రజలకు సమస్యగా మారిందని ప్రజలంటున్నారు. పంచాయతీ సెక్రటరీ డిప్యూటేషన్ మీద కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిపోవడంతో, స్టాఫ్ లేనప్పుడు డిప్యూటేషన్ ఎలా ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 13 మంది ఉద్యోగులు పని చేయాల్సిన సచివాలయంలో కేవలం 5 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.