రాయచోటి: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం

51చూసినవారు
రాయచోటి: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటాం
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అన్నారు. శుక్రవారం రాయచోటిలో ఆయన మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో చేసిన త్యాగాలు, సేవలు పోలీసు శాఖను ఉన్నత స్థానంలో నిలిపిందని ఆయన అన్నారు. పోలీసులకు అందాల్సిన ప్రభుత్వ సహాయం పై దృష్టి సారిస్తామని, వ్యక్తిగత సమస్యలైనా తమ వద్దకు తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్