అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు ఆదేశాలు మేరకు డిఎస్పి కృష్ణ మోహన్ నేతృత్వంలో ట్రాఫిక్ సిఐ విశ్వనాథరెడ్డి, అర్బన్ సిఐ చంద్రశేఖర్ గురువారం రాయచోటి పట్టణంలో హెల్మెట్ వాడకం పై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడకాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. లక్షలాది రూపాయలు వ్యయం చేసి బైకులు కొన్నవారు హెల్మెట్ వాడక పోవడంవాడకపోవడం బాధాకరం అన్నారు.