వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి అన్నారు. మంగళవారం రామాపురం మండలంలో నిర్వహించిన "ఇది మంచి ప్రభుత్వం" ప్రజాదర్బార్ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు.