మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విచారణకు మరోసారి డుమ్మా కొట్టారు. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు రావాలని ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. తాజాగా బుధవారం కూడా ఇంట్లో వారికి నోటీసులు అందజేశారు. అయితే మూడో సారి కూడా విచారణకు హాజరు కాలేదు. మరి పోలీసులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి.