రాష్ట్ర ప్రభుత్వం స్వఛ్ ఆంధ్రా కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టే స్వచ్ఛతా-హి-సేవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో కాకినాడ నగరం క్లీన్ అండ్ గ్రీన్‌గా మారాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన అన్నారు. గురువారం సాయంత్రం కమిషనర్ అదనపు కమిషనర్ టీకే సుధాకర్, ఎస్‌ఈ సత్యకుమారి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ తదితర విభాగాల అధికారులతో సమావేశమయ్యారు.