మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని.. చివరికి!

75చూసినవారు
మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని.. చివరికి!
AP: రాజమండ్రిలోని బొల్లినేని కిమ్స్ ఆస్పత్రిలో 12 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఫార్మసీ విద్యార్థిని నాగ అంజలి తనువు చాలించింది. శుక్రవారం తెల్లవారుజామున స్ట్రోక్ రావడంతో ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ నెల 23న నాగ అంజలి ఆత్మహత్యాయత్నం చేశారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాశారు. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్