AP: హెల్మెట్ లేకపోవడం, మైనర్లు వాహనాలు నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం తదితర కారణాలతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ఇటీవల ఏం చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో మార్చి 1 నుంచి మోటారు వాహనాల చట్టాన్ని బలోపేతం చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. జరిమానాలు భారీగా పెంచారు.