AP: ‘ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. ’ ఇదేదో సినిమా డైలాగ్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే. గతంలో రవాణా, పోలీసు శాఖ వారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అడపాదడపా జరిమానాలు విధించేవారు. చూసీచూడనట్లు వ్యవహరించేవారు. ఇప్పుడు కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో మొన్నటివరకు ఉన్న జరిమానాలు నాలుగింతలు పెరిగాయి.