పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో కిడ్నాప్ కలకలం రేగింది. వెంకుపాలెం సమీపంలో ఆటోలో వెళ్తున్న వారిని కారులో ఉన్న 8 మంది అడ్డగించారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో నలుగురిపై దాడికి పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసి భయాందోళనలకు గురి చేశారు. వారిలో వైసీపీ నేత నాగరాజును దుండగులు కారులో ఎత్తుకెళ్లారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.