అల్లవరం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న ఉపాధి హామీ కూలీల బ్యాంకు ఖాతాలను ఎన్పీసీఐ లింకు చేయాలని ఎంపీడీవో కృష్ణమోహన్ సూచించారు. ఆయన అల్లవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జాబ్ కార్డు కలిగి ఉన్న ఉపాధి హామీ కార్మికులందరికీ పోస్ట్ ఆఫీస్ లలో ఎన్పీసీఐ లింక్ చేయించేందుకు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు చర్యలు చేపట్టాలన్నారు.