ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ అన్నారు. ఆయన అమలాపురం రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు ఆధ్వర్యంలో అమలాపురంలో రోడ్డు భద్రత నియమాలు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహించారు. అవగాహన సదస్సులో పాల్గొన్న ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత నియమాలపై సీఐ అవగాహన కల్పించి సూచనలు చేశారు. అదేవిధంగా అవగాహన ర్యాలీని నిర్వహించారు.