అమలాపురం: ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించేందుకు చర్యలు: జేసీ

50చూసినవారు
కోనసీమలో అర్హత కలిగిన లబ్ధిదారులందరికీ ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లను అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ నిశాంతి శుక్రవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీర పాండియన్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో ధాన్యం కనుగోలు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ పై చర్చించారు.

సంబంధిత పోస్ట్