అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు మండల పరిషత్ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రముఖ చేనేత కార్మికుడు సోరపల్లి పద్మినీకుమార్ చేనేత రాట్నం చరఖాను తీసుకురాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతంత్ర్య ఉద్యమంలో చరఖా పాత్రను విద్యార్థులకు వివరించారు.