విజయవాడలో శుక్రవారం జరిగిన దక్షిణ మధ్య రైల్వే వార్షిక సమావేశంలో అమలాపురం ఎంపీ హరీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కోనసీమ రైల్వే లైన్ నిర్మాణాన్ని పూర్తిచేయడంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లపై చర్చించి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన చర్యలను చేపట్టాలని రైల్వే మంత్రి, అధికారులను కోరారు. జన్మభూమి, ఉదయ్, కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ద్వారపూడి రైల్వే స్టేషన్ లో ఆగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.